డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా భీమవరం పట్టణ తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. భీమవరం పట్టణ టిడిపి కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు మద్దుల రాము అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన అనంతరం ఉపాధ్యాయులను సన్మానించారు. ఈసందర్భంగా టిడిపి రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారధి మాట్లాడుతూ ఎంతో ఓర్పుతో పాఠాలు చెబుతూ విద్యార్థులను ఉన్నత స్థాయిలో నిలబెడుతున్న ప్రతి గురువు దైవంతో సమానమని సమాజంలో గురువుకు విశిష్ట స్థానం ఉందన్నారు.