దేశ అధికారిక భాష హిందీకి ప్రాముఖ్యతను పెంచాలని సూర్యాపేట జిల్లా హిందీ రిసోర్స్ పర్సన్ జి. ఆనంద భాస్కర్ అన్నారు. శనివారం హిందీ భాషా దినోత్సవం సందర్భంగా పెన్పహడ్ కేజీబీవీ పాఠశాలలో నిర్వహించిన టీఎల్ మేళా, సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలుగు భాష మాదిరిగానే హిందీ భాష కూడా మధురమైందన్నారు.