తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో (పి4) కార్యక్రమంలో భాగంగా వివిధ రాజకీయ నాయకులతో పాటు వివిధ సంఘాల నాయకులు, వాణిజ్య వ్యాపారస్తులతో సభ నిర్వహించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ కన్వీనర్ వలవల బాబ్జి, భారతీయ జనతా పార్టీ కన్వీనర్ ఈతకోట తాతాజీ ఆర్డీవో కతీఫ్ కౌసర్ భనో మున్సిపల్ కమిషనర్ ఏసుబాబు స్పెషల్ ఆఫీసర్ కూటమి సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడారు.