సుమారు 3 కిలోల బంగారు ఆభరణాలతో విశాఖ నుంచి ముంబయి వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని మూడు రోజుల కిందట విశాఖ రైల్వేస్టేషన్లో ఆర్పీఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఆర్బీఎఫ్ ఎస్సై జేకే.మీనా, జీఎస్టీ ఉన్నతాధికారుల సమక్షంలో తనిఖీలు నిర్వహించారు. బంగారు ఆభరణాలతో పాటు, బంగారం బిస్కెట్లు, ప్లాటినమ్ తయారు చేసిన ఆభరణాలు ఉన్నట్టు గుర్తించారు. వాటికి సంబంధించిన పత్రాలు, రసీదులు తనిఖీ చేశారు. సుమారు 300 గ్రాముల బంగారానికి సరైన పత్రాలు లేకపోవడంతో రూ.1 లక్షలు జరిమానా విధించినట్టు సమాచారం. ఈ అంశంపై జీఎస్టీ, ఆర్పీఎఫ్ అధికారులు ఎలాంటి వివరాలు వెల్లడించడం లేదు.