నిజామాబాద్‌లో నిర్వహించనున్న వినాయక శోభాయాత్ర రథోత్సవం పూర్తయింది. రథానికి 5 గుర్రపు బొమ్మలను ఏర్పాటు చేశారు. అలాగే పూలమాలలతో అందంగా అలంకరించారు. మధ్యాహ్నం 1:30 గంటలకు శోభాయాత్ర ప్రారంభం కానుంది. రథానికి తాడు కట్టి ఎడ్లతో లాగడం అనవాయితీగా వస్తుంది. సార్వజనిక్ గణేష్ మండలి సభ్యులు రథాన్ని జెండా ఊపి ప్రారంభిస్తారు. దుబ్బ నుంచి ప్రారంభమై గోల్ హనుమాన్ మీదుగా వినాయకనగర్ వినాయక బావి వరకు కొనసాగుతోంది. అనంతరం వినాయకులభావిలో వినాయకులను నిమజ్జనం చేస్తారు.