నందవరం: అనుమతి లేని పురుగు మందులు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు..నందవరం మండల వ్యవసాయ అధికారి సరిత శుక్రవారం నాగలదిన్నె గ్రామంలోని ఎరువులు, పురుగు మందుల దుకాణాలను తనిఖీ చేశారు. కొరమండల్, శివ కిరణ్ ట్రేడర్స్, శ్రీవెంకటేశ్వర ట్రేడర్స్, శ్రీనివాస ఆగ్రో ఏజెన్సీలలో జరిగిన తనిఖీల్లో విక్రయాలు ఎంఆర్పీ ధరల్లోనే జరగాలని, స్టాక్ రిజిస్టర్ లో వివరాలు నమోదు చేయాలని సూచించారు. అనుమతి లేని ఎరువులు, పురుగు మందులు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.