అనంతపురం జిల్లా ఉరవకొండ మండల పరిధిలోని మైలారం పల్లి గ్రామంలో భర్త వేధింపులు భరించలేక ఏడు నెలల నిండు గర్భిణీ మౌనిక మంగళవారం రాత్రి ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం వెలుగులోకి రావడంతో మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఉరవకొండ ఎస్సై జనార్ధన్ నాయుడు పేర్కొన్నారు. గత కొన్ని నెలలుగా మృతురాలి భర్త హనుమంతు వేధింపులు భరించలేక ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి బంధువులు పోలీసులను కోరారు. ఏడు నెలల నిండు గర్భిణి ఆత్మహత్య చేసుకుని మృతి చెందడంతో మైలారం పల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.