జడ్పిటిసి ఎంపిటిసి స్థానాల తుది ఓటర్ జాబితాను ఈనెల 10న విడుదల చేయనున్నట్లు జడ్పీ సీఈవో జానకి రెడ్డి తెలిపారు. సంగారెడ్డి కలెక్టరేట్లో మినీ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జడ్పీ సీఈఓ జానకి రెడ్డి డిఆర్ఓ పద్మజారాణిలు పాల్గొని మాట్లాడారు. ముసాయిదా జాబితా పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని సూచించారు వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి అవసరమైన మార్పులు చేర్పులు చేసి సెప్టెంబర్ 10వ తేదీన తుది జాబితా వెలువరిస్తామని పేర్కొన్నారు.