ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (CITU అనుబంధం) కడప నగర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్ కార్మికుల నివాస ప్రాంతమైన శంకరాపురం మున్సిపల్ క్వార్టర్స్‌లో పాదయాత్ర రెండవ రోజుగా నిర్వహించబడింది. ఈ పాదయాత్రను మున్సిపల్ యూనియన్ నగర అధ్యక్షులు సుంకర రవి గారు ప్రారంభించి, మున్సిపల్ కార్మికులు నివసిస్తున్న ప్రాంతం తుప్పరమైన, అధ్వాన్న పరిస్థితుల్లో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, త్రాగునీటి పైప్‌లైన్ లేకపోవడం, ఎలక్ట్రిక్ పోల్స్ లేక కార్మికులు అంధకారంలో నివసించాల్సిన పరిస్థితి ఏర్పడడం దుర్మార్గమని ఆయన పేర్కొన్నారు.