మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండల కేంద్రంలోని పీఏసీఎస్, వ్యవసాయ కార్యాలయంలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం యూరియా బస్తాలకు టోకెన్లు ఇవ్వడంతో గందరగోళం నెలకొంది. రోజులుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా యూరియా లభించడం లేదని, సరైన సమయంలో పంపిణీ చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆరోపించారు. వెంటనే యూరియా అందుబాటులోకి తీసుకురావాలని వారు కోరారు.