జిల్లా పోలీస్ యంత్రాంగం మహిళలు, బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు, పాఠశాలలు మరియు కళాశాలల్లో 'శక్తి' యాప్ వినియోగంపై అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు.'శక్తి' యాప్ మహిళలు, బాలికల రక్షణకు అత్యవసర పరిస్థితుల్లో ఎంతగానో ఉపయోగపడుతుందని 'శక్తి' టీమ్ మహిళా ఎస్.ఐ శాంతమ్మ తెలిపారు. ఈ యాప్ యొక్క ప్రాముఖ్యత మరియు దానిని ఎలా ఉపయోగించాలనే దానిపై అవగాహన కల్పించారు.