సెప్టెంబరు 6వ తేదీ నుండి అల్లూరి సీతారామరాజు జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్ మంగళవారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2.98లక్షల లబ్దిదారులు ఉన్నారన్నారు. వారం రోజుల వ్యవధిలో స్మార్ట్ కార్డుల పంపిణీ పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. 671చౌక ధరల దుకాణాలు ఉన్నాయని, వాటిలో 33ఆన్లైన్ షాపులు, 638 ఆఫ్లైన్ షాపులు ఉన్నాయన్నారు. చౌక ధరల దుకాణాలను రెవెన్యూ అధికారులు తనిఖీ చేయాలన్నారు.