గుత్తి పట్టణ శివారులో ఆదివారం ఓ లారీ డ్రైవర్ కు విపరీతంగా కడుపునొప్పి తో పాటు కళ్ళు తిరిగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ లారీని రోడ్డు పక్కన ఆపేశాడు. వివరాల్లో వెళితే అనంతపురం కు చెందిన లారీ డ్రైవర్ భాష కర్ణాటక నుంచి సింహాద్రి పురానికి లారీలో జే సీ బీని లోడ్ చేసుకొని వెళుతున్నాడు. అయితే మార్గమధ్యలో కడుపు నొప్పితో పాటు కళ్ళు తిరిగాయి.లారీని ఆపి గుత్తి ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకున్నాడు.