భారీ వర్షాల కారణంగా 44 జాతీయ రహదారి జలమయమై రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో సోన్ మండలం గంజాల్ టోల్ ప్లాజా వద్ద హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను పోలీసులు శుక్రవారం నిలిపివేశారు. హైదరాబాద్ వెళ్లే వాహనదారులు నిర్మల్ వద్ద కొండాపూర్ బ్రిడ్జి నుంచి ఎడమవైపు డైవర్షన్ తీసుకొని అక్కడి నుంచి మామడ, ఖానాపూర్, మెట్ పల్లి, జగిత్యాల, కరీంనగర్ మీదుగా హైదరాబాద్ చేరుకోవాలని కోరారు.