ఏలూరు జిల్లాలో యూరియా సరిపడగా ఉందని, సోషల్ మీడియా అసత్య ప్రచారాలను నమ్మవద్దని జిల్లా ఎస్పీ కే ప్రతాప్ శివ కిషోర్ పిలుపునిచ్చారు. గురువారం భీమడోలు సొసైటీ గోడౌన్ ను, స్థానిక ఎరువులు షాపులను జిల్లా వ్యవసాయ అధికారి హబీబ్ బాషాతో కలిసి ఎస్పీ యూరియా నిల్వలు తనిఖీలు చేసారు. జిల్లాలో 1914మెట్రిక్ టన్నులు యూరియా నిల్వలు సరిపడా ఉన్నాయని, ఎవరైనా అధిక ధరలకు యూరియా, కాంప్లెక్స్ ఎరువులు విక్రయిస్తే 112 కి సమాచారం ఇవ్వాలని ఎస్పీ పిలుపునిచ్చారు. అప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు పాల్గొన్నారు.