సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సంకల్ప్ కార్యక్రమంలో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, డి ఎం హెచ్ వో రజిత మాట్లాడుతూ సంకల్ప్ కార్యక్రమంలో భాగంగా భేటీ పడావో బేటి బచావో కార్యక్రమం చేపట్టారు. గర్భస్థ పిండా లింగ నిర్ధరణ పరీక్షలు చేయించడం చట్టరీత్యా నేరమని అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆడపిల్లలను మగపిల్లలతో సమానంగా హక్కులు కలిగి ఉంటారని అన్నారు. తల్లిదండ్రులు, బంధువులు బలహీనతను ఆధారం చేసుకొని గర్భస్థ పిండ ఆరోగ్య స్థితిని