ఖైరతాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ పరిణామాల మధ్య జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం చాలా ముఖ్యమని అన్నారు. పార్టీ అధిష్టానం సరైన అభ్యర్థిని ఎంపిక చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. టికెట్ ఎవరికి వచ్చినా గెలుపు నాకు కృషి చేస్తానని ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు.