కాంగ్రెస్ పార్టీ లో బహుజనులకు ఏం న్యాయం జరగదని, రైతులకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ లో, రౌడీ రాజ్యంలో తాను ఉండలేనని కాంగ్రెస్ పార్టీ నాయకుడు చక్రధర్ గౌడ్ అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు చక్రధర్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చక్రధర్ గౌడ్ మాట్లాడుతూ.. మైనంపల్లి హనుమంతు రావు హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని, మైనం పల్లి పై అధిష్టానం కఠిన చర్యలు తీసుకోవాలని,లేకుంటే మెదక్ జిల్లా బిఆర్ఎస్ కైవసం చేసుకుంటుందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్కస్థానం కాంగ్రెస్ గెలువదన్నారు. పార్టీకి రాజినామా చేస్తున్న, పార్టీ అ