అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో స్మార్ట్ మీటర్లు, ట్రూ అప్ చార్జీలు రద్దు చేసి, సెకీ ఒప్పందాలు ఉపసంహరించుకోవాలని సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో గురువారం విద్యుత్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి ఏడీఈ నాగేంద్రకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బి.శ్రీనివాసులు, సీపీఎం పట్టణ కార్యదర్శి మారుతీ ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలపై అధిక విద్యుత్ భారాలు మోపే విధంగా ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన స్మార్ట్ మీటర్లు, ట్రూ అప్ చార్జీలను రద్దు చేయాలన్నారు. కూటమి అధికారంలోకి రాకముందు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తే పగలగొట్టాలని నారా లోకేష్ చెప్పి మాట తప్పారని అన్నారు.