తిరుపతి జిల్లా సూళ్లూరుపేట లో ఆటో కార్మిక యూనియన్ నాయకులు బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న రవాణా రంగం, వాటిలో ఆటోల ద్వారా ఉపాధి పొందుతున్న కార్మికుల పట్ల ప్రభుత్వానికి ఏమాత్రం కనికరం లేదన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక స్త్రీ శక్తి మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆటో కార్మికులు వీధిన పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణ గ్రామీణ ప్రాంతాలలో ఉద్యోగ ఉపాధి లేక నిరుద్యోగ యువకులు ఉన్నత చదువులు చదివి ఆటో డ్రైవర్ గా మారుతున్నారన్నారు. వచ్చిన ప్రభుత్వాలు వీరికి ఉద్యోగ అవకాశాలు కల్పించలే