పర్యావరణ హితమైన మట్టి వినాయకులను పూజించడం వల్ల చెరువులు కాలుష్యం నుంచి కాపాడుతాయని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం పటాన్ చెరు గాంధీ పార్క్ సమీపంలో జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై ప్రజలకు స్వయంగా ప్రతిమలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రజలందరూ మట్టి వినాయకులను పూజించాలని విజ్ఞప్తి చేశారు.