మందమర్రి ఏరియాలోని ప్రాణహిత కాలనీ షిర్కెలో నిర్మిస్తున్న ఎయిర్టెల్ టవర్ నిర్మాణం ఆపాలని కాలనీ వాసులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం వారు మాట్లాడుతూ ఇప్పటికే కాలనీకి దగ్గరగా ఉన్నా సోలార్ ప్రాజెక్టు వల్ల కాలనీ వాసులు వేడికి ఇబ్బంది పడుతున్నారని, ఇప్పుడు కాలనీకి అతి దగ్గరగా సెల్ టవర్ నిర్మించడం వల్ల, పిల్లలు రేడియేషన్ కి గురి కావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఇప్పటికే ఏరియా జిఎంకి విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని తెలిపారు.