జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీలో నిర్వహించిన వేడుకల్లో సోమవారం సాయంత్రం 7 గంటలకు జరిగిన బియ్యం పంపిణీ కార్యక్రమం గందరగోళానికి దారి తీసింది. ఆశయం గొప్పదైన నిర్వహణలో లోపాలతో మహిళల మధ్య తోపులాట జరిగింది. అంతేకాకుండా పుట్టినరోజు సందర్భంగా పంచిన బియ్యం బస్తాలు మోయలేక వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గేటు ముందు మహిళలు ఒకేసారి తోపులాటకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కార్యక్రమంలో జనసేన ఎమ్మెల్యే రామాంజనేయులు, జిల్లా అధ్యక్షుడు గోవిందరావు పాల్గొన్నారు.