నారాయణపేట పట్టణంలోని పళ్ల వీధిలో దీక్షిత్ ఇంట్లో 800 ఏళ్లుగా నిత్యపూజలు అందుకుంటున్నాడు వినాయకుడు . సాధారణంగా వినాయక చవితి అంటే ప్రతిష్ఠాపన చేసి 3, 5, 7, 9 రోజులు పూజలు చేసి గంగమ్మ ఒడికి చేరుస్తారు. కానీ ఈ మట్టి వినాయకుడు ఏళ్లుగా పూజలు అందుకుంటున్నాడు. శక్తిపీఠంలో యజ్ఞ నారాయణ పురోహిత్ ఇంట్లో 726, మూల హనుమాన్ ఆలయ సమీపంలోని దేవుజి నివాసంలో 356 సంవత్సరాల వినాయకుడు ఉన్నాడు