నరసాపురం మండలం రుస్తుంబాద పంచాయతీకి చెందిన సుంకర దుర్గా భరత్ కుమారుడు నికిత్ (10) దురదృష్టవశాత్తు కాలువలో పడి మృతి చెందిన ఘటన శనివారం సాయంత్రం 6 గంటలకు చోటుచేసుకుంది. ప్రభుత్వ విప్ మరియు నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఘటన స్థలానికి చేరుకొని సంతాపం వ్యక్తం చేశారు. బొమ్మిడి నాయకర్ నికిత్ భౌతిక కాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన, టిడిపి, బిజెపి నాయకులు, జనసైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.