సోన్ మండలం కడ్తాల్ గ్రామం వద్ద 44 జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం కడ్తాల్ గ్రామానికి చెందిన ప్రసాద్ అనే యువకుడు ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి తిరిగి వస్తున్నాడు. జాతీయ రహదారిపై నిలిపి ఉన్న లారీని వెనుక నుండి ఢీకొట్టడంతో ప్రసాద్ తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మంగళవారం తెల్లవారుజామున రహదారిపై మృతదేహాన్ని గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.