Kandukur, Sri Potti Sriramulu Nellore | Aug 28, 2025
కందుకూరులోని తూర్పు సాలెపాలెంలో ఇంటి ముందు పార్కింగ్ చేసి ఉన్న కారు దగ్ధమైంది. గురువారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో శబ్దం రావడంతో బయటికి వచ్చిన బాధితుడు నరేశ్ కారు తగలబడుతుండడం కనిపించిందని వాపోయాడు. ఇది దుండగుల దుశ్చర్య అని అనుమానం వ్యక్తం చేశాడు. పక్కనే ఉన్న మరో రెండు కార్లకు మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు చెప్పారు. టౌన్ ఎస్ఐ శివనాగరాజు కేసు నమోదు చేశారు.