మక్తల్ పట్టణంలోని ఆదివారం ఎస్సీ హాస్టల్ను బహుజన సమాజ్ పార్టీ నాయకులు సందర్శించారు. హాస్టల్ విద్యార్థుల స్థితిగతులను అడిగి తెలుసుకున్న పార్టీ అసెంబ్లీ అధ్యక్షుడు కె.వి. నరసింహ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలకు మెనూ ప్రకారం సరైన ఆహారం అందించాలని డిమాండ్ చేశారు. శిథిలావస్థలో ఉన్న పాత భవనాన్ని తొలగించి, నూతన భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు