రాష్ట్రంలో రైతులకు యూరియా సరఫరా చేయడంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సీపీఐ నేత వైఎన్ భద్రం, రైతు సంఘం ఉపాధ్యక్షుడు కోరిబిల్లి శంకర్రావు విమర్శించారు. సోమవారం అనకాపల్లి పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో భద్రం మీడియాతో మాట్లాడారు. యూరియా ధర రూ.270 బస్తా ధర ఉంటే ప్రైవేట్ వ్యాపారస్తులు రూ.300 విలువ చేసే దొబ్బు గులికలు కొనాలని మెలిక పెట్టడం తగదన్నారు.