కృష్ణా నది వరదల సమయంలో స్తానిక అవినిగడ్డ మండలం పాత ఎడ్లంక వాసులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామానికి చెందిన తెనాలి భాగ్యం అనే మహిళా సోమవారం మద్యాహ్నం 3 గంటల సమయంలో మృతి చెందడంతో ఆమె మృత దేహాన్ని పడవపై అవతలి వద్దకు కుటుంబ సభ్యులు చేరవేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల నుండి గ్రామానికి విముక్తి కల్పించమని ఎంతో కాలంగా బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రభుత్వాన్ని వేడుకుంటున్నామని అవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామాన్ని రక్షించాలని నాలుగు రోజులుగా గ్రామస్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.