జాతీయ ఉపాధి హామీ పథకం (ఈజీఎస్) కింద రైతులకు, కూలీలకు ఉపయోగకరమైన పనులను చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. శుక్రవారం నిర్మల్ రూరల్ మండలం డ్యాంగాపూర్ గ్రామంలో నిర్వహించిన పనుల జాతర కార్యక్రమంలో భాగంగా ఈజీఎస్ నిధులతో నిర్మించిన పశువుల పాకను లబ్ధిదారులతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ, జాతీయ ఉపాధి హామీ పనుల్లో రైతులకు ఉపయోగపడే గొర్రెలు, పశువుల పాకలు, పౌల్ట్రీ, పొలంబాటలు వంటి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రతి గ్రామపంచాయతీ స్థాయిలో ప్రజలకు ఉపాధి హామీ పనులపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. జిల్లాలో 100%