యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో పుష్ప సినిమా సీన్ రిపీట్ అయింది. ఆదివారం ఉదయం చౌటుప్పల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజమండ్రి, కోదాడ నుండి హైదరాబాదులోని బహుదూర్పురకు రెండు డీసీఎం వాహనాలలో కింద ఆవులు పైన అట్టపెట్టలను తరలిస్తుండగా బజరంగ్దళ్ కార్యకర్తలు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకొని రెండు డీసీఎం వాహనాలను, 43 గోవులను స్వాధీనం చేసుకొని గోవులను చల్లూరు గోశాలకు తరలించి, డ్రైవర్ల పై కేసు నమోదు చేశారు.