ప్రతి అధ్యాపకుడు విద్యార్థుల హాజరుపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం ద్వారా మొదటి పీరియడ్ లోనే హాజరు తీసుకోవాలని DIEO తిరుమలపూడి రవికుమార్ ఆదేశించారు. నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శ్రీ బుద్దిరాజ్ అధ్యక్షతన అధ్యాపకుల, బోధనేతర సిబ్బంది తో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి అధ్యాపకుడు కళాశాలకు హాజరు కాని విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధ వహించాలని, వారిని కళాశాలకు క్రమం తప్పకుండా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.