SRPT:సూర్యాపేట జిల్లాలో రైతులకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉంచాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు నాగార్జున రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేటలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా అధికార యంత్రాంగం సైతం రైతులకు సరిపడా యూరియా నిల్వలపై సమీక్షించి సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యారని విమర్శించారు.