కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఆడి కృత్తికా నక్షత్ర కావడి ఉత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. మేకవారిపాలెంలో కొలువై ఉన్న సుబ్రమణ్య స్వామి వారి ఆలయానికి వేలాదిగా భక్తులు కావళ్ళతో బయలుదేరి కావడి యాత్రను నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకిలో కొలువు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కావడి సేవను ప్రారంభించారు. ఆ వెనుక కావళ్ళు ధరించిన భక్తులు స్వామి వారి నామ స్మరణ చేసుకుంటూ కావడి యాత్రలో పాల్గొన్నారు.