మందమర్రి జిఎం కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఇంచార్జ్ జిఎం మాట్లాడుతూ ఆగస్టు నెలలో సాధించాల్సిన బొగ్గు ఉత్పత్తి శాతం వర్షాల కారణంగా అనుకున్న దానికంటే నీరు ఎక్కువగా చేరడంతో బొగ్గు ఉత్పత్తిలో లోటు కనిపించిందని వర్షాలు తగ్గుముఖం పడితే సెప్టెంబర్ నెలలో రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తిని చేయడం జరుగుతుందని అన్నారు. కేకే ఓ సి కాంట్రాక్టు అవార్డు ఇవ్వడం జరిగిందని మరో రెండు నెలల తర్వాత కేకే ఓసి లో బొగ్గు ఉత్పత్తి గణనీయంగా జరుగుతుందని అలాగే ఇతర గన్నుల్లో కూడా సాధ్యమైనంత ఎక్కువగా బొగ్గు ఉత్పత్తిని చేసి టార్గెట్ ను చేరుకునేలా చర్యలు తీసుకుంటామని అన్నారు