దేశ ప్రధానిగా స్వర్గీయ అటల్ బిహారి వాజ్పేయీ చేసిన సేవలు మరువలేనివని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు.బుధవారం వాజ్పేయీ శతజయంతి వేడుకలను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించి,ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, నేతలు లాలా మున్న, జ్యోతిరెడ్డి, రవి, తదితరులు ఉన్నారు.