మహబూబాబాద్ పట్టణంలో మంగళవారం సాయంత్రం 5:00 లకు ఓ కుటుంబంలో ఘోర విషాదం నెలకొంది.. పట్టణంలోని చిట్యాల గోపయ్య నగర్ సమీపంలో గల వ్యవసాయ సాగు భూమిలో ట్రాక్టర్ తిరగబడి మాదాసు చింటూ అనే యువకుడు మృతి చెందాడు.. పొలం పనులలో భాగంగా ట్రాక్టర్ తో దున్నుతున్న క్రమంలో బోల్తా పడి యువకుడు మృతి చెందాడు.. చింటూ మృతి చెందడంతో తన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.