గుంటూరు జిల్లా వివిఐటి కళాశాలలో నిర్వహించిన మాదకద్రవ్యాల నివారణ అవగాహన సదస్సులో ఈగల్ విభాగం డైరెక్టర్ ఆకే రవికృష్ణ మంగళవారం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. డ్రగ్స్ను తీసుకోవడం వల్ల జీవితం నాశనమవుతుందని, అది దేశాన్ని సైతం దెబ్బతీస్తుందని ఆయన అన్నారు. విద్యా సంస్థల్లో ఎక్కడైనా గంజాయి ఆనవాళ్లు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని కోరారు. మనం తీసుకునే నిర్ణయమే మన జీవితాన్ని నిర్దేశిస్తుందని తెలిపారు. విద్యార్థులు చక్కగా చదువుకొని మంచి భవిష్యత్తును కలిగి ఉండాలని ఆయన సూచించారు.