మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలనీ గొల్లపల్లి వాటర్ వర్కర్స్ కు పెండింగ్ లో ఉన్న నాలుగు నెలల జీతాలను వెంటనే ఇవ్వాలనీ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కనిశెట్టిపల్లి వినోద్ కుమార్ , జిల్లా ప్రధాన కార్యదర్శి డి.ఆంజనేయులు మాట్లాడుతూ హిందూపురం మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులు ఈఎస్ఐ,పిఎఫ్ అడ్డదారిన సొంత ఖాతాలోకి మళ్లించుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని 220 మందికి సంబంధించిన 494000 రూపాయల నగదును రికవరీ చేయాలని డిమాండ్ చేశారు