పుట్టపర్తి పట్టణంలో మంగళవారం సాయంత్రం ఓ మోస్తరు వర్షం కురిసింది. వారం రోజులుగా ఎండ వేడిమి ఒక్కపోతతో ఇబ్బందులు పడ్డ పుట్టపర్తి వాసులు సాయంత్రం కురిసిన వర్షం ధాటికి కొద్దిగా ఉపశమనం పొందారు. రాబోయే రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.