కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం వికలాంగులకు 6వేలు మరియు చేయుత పెన్షన్ దారులకు 4వేలు వెంటనే పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తూ సోమవారం మధ్యాహ్నం 2గంటలకు కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నా చేశారు.ఈ కార్యక్రమంలో VHPS నాయకులు అంజిరెడ్డి రెడ్డి, బాపురెడ్డి, కౌసల్య హజరై మాట్లాడుతూ..తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వికలాంగులకు 6వేలు,వృద్ధులకు,వితంతువులకు,ఒంటరి మహిళలకు,చేనేత కార్మికులకు,బీడీ,గీత కార్మికులకు 4వేలు మరియు కండరాల క్షీణత 15వేలు పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి 20 నెలలు గడిచిన పెన్షన్లు పెంచకుండా మోసం చేస్తున్నారని మండిపడ్డారు.