గుంటూరు జిజిహెచ్ లో రోగి సహాయకులకు టీలో మత్తు మందు కలిపి బంగారం చోరీ చేసిన మహిళను కొత్తపేట పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం గురజాలకు చెందిన లక్ష్మీభాయ్, ఆర్టీసీ కాలనీకి చెందిన నరసమ్మ బంధువులు ఆసుపత్రిలో ఉన్నారు. పేరేచర్లకు చెందిన దీనమ్మ రోగి సహాయకులతో మాటలు కలిపి టీలో మత్తు మందు కలిపింది. వారు మత్తులోకి జారుకున్న తర్వాత బంగారాన్ని చోరీ చేసింది. ఈ కేసులో నిందితురాలను అరెస్ట్ చేసినట్లుగా ఈస్ట్ డిఎస్పి అజిత్ తెలిపారు.