అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె లో గురువారం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో బషీర్ బాగ్ విద్యుత్ పోరాటంలో అసువులు బాసిన అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించి. స్థానిక అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ తంబాలపల్లి నియోజకవర్గ కార్యదర్శి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు అధికారంలో వస్తే విద్యుత్ చార్జీలు పెంచమని పెరిగిన వాటిని తగ్గిస్తామని ఇచ్చిన హామీని .కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కి అధికారంలో వచ్చిన ఏడాది కాలంలోనే రాష్ట్ర ప్రజలపై వేలకోట్ల భారం మోపారని అన్నారు. వెంటనే స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ఉపసంహరించుకోవాలని కోరారు.