సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా బోథ్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ ఫ్లెక్సీను ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీను గుర్తు తెలియని వ్యక్తులు చింపివేశారు. ఫ్లెక్సీలను బీఆర్ఎస్ నాయకులే చింపేశారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులతో ఎమ్మెల్యే దగ్గరుండి మరీ ఫ్లెక్సీని చింపించారని కాంగ్రెస్ బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి గజేందర్ శుక్రవారం ఆరోపించారు. ఫ్లెక్సీ ని చింపి వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫ్లెక్సీ చించేసిన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.