వైయస్సార్ ఆశయాలను నెరవేర్చడానికి పిసిసి అధ్యక్షురాలు షర్మిల కృషి చేస్తుందని డీసీసీ అధ్యక్షుడు చిలకా విజయ్ కుమార్ అన్నారు. మంగళవారం గుంటూరు నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైయస్సార్ పేదలకు పెన్నిదని, ప్రాజెక్టు నిర్మాణదాతగా పేరు తెచ్చుకున్నారన్నారు. ఆంధ్రాలో రెండుసార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన వ్యక్తి వైఎస్ఆరే అన్నారు. అయితే ఎన్డీఏ కూటమికి వై.ఎస్. జగన్ దాసోహం అవ్వడం బాధ కలిగిస్తోందన్నారు.