ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ బస్సు ఎత్తివేయేలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి కొత్త బస్టాండ్ ముందు కొంత మంది మహిళలు ధర్నా చేపట్టారు. మాకు వద్దు ఈ కాంగ్రెస్ పాలన, రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం వలన ప్రతి నిత్యం మహిళలు సైతం ఇబ్బందులు పడుతున్నారని ముఖ్యమంతి రేవంత్ రెడ్డి వెంటనే మహిళలు ఫ్రీ బస్సు సౌకర్యం ఎత్తివేయాలని కోరారు. ఫ్రీ బస్సు డబ్బులను విద్యార్థులకు, వైద్యం కోసం ఖర్చు చేయాలని అన్నారు.