యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలమైందని, కాంప్లెక్స్ ఎరువుల ధరలు భారీగా పెరిగినా తగ్గించేందుకు చర్యలు తీసుకోలేదని కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి జమలయ్య మండిపడ్డారు. శనివారం గుంటూరులో మాట్లాడారు. APకి 6.29 లక్షల టన్నుల యూరియా కేటాయించగా 4.14 లక్షల టన్నులే అందాయని, ఇంకా 2.15 లక్షల టన్నుల కొరత ఉందని తెలిపారు. కౌలురైతులే 80% సాగు ఉన్నప్పటికీ వారికి గుర్తింపు కార్డులు లేక యూరియా అందకపోవడం దారుణమన్నారు.