గుమ్మడిదల మున్సిపాలిటీ అన్నారం గ్రామంలో ఘనంగా పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతిని గురువారం నిర్వహించారు. మండల బిజెపి పార్టీ అధ్యక్షుడు ఐలేష్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.