చింతపల్లి మండలంలోని ఏరియా ఆసుపత్రి, లోతుగెడ్డ, కోరుకొండ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ టీ.విశ్వేశ్వరనాయుడు గురువారం తనిఖీలు నిర్వహించారు. ముందుగా ఆయా ఆసుపత్రుల్లోని రికార్డులను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.